భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ తీసిన బాండిట్ క్వీన్  చాలా బావుంటుంది. ఇది పూలన్ దేవి ఆత్మకథ. పూలన్ దేవి 11 సంవత్సరాల వయసులో భర్త ఇంటికి బలవంతంగా చేరుతుంది. ఆమె పై జరిగిన మరిటెట్ రేప్ ని ఒక చిన్నపిల్ల అసహాయత ఎమోషన్స్ తో చూపించటం లో దర్శుకుడి ప్రతిభ కనిపిస్తుంది. రేప్ కి ప్రేమకి గల వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు శేఖర్ కపూర్. పెద్ద కులస్థులతో జరిగిన పోరాటం లో ఆమె బంది పోట్ల మధ్యకు చేరిపోతుంది. పూలన్ దేవి ఈ సినిమాకు ముందుగా వ్యతిరేకించిన తర్వాత దాన్ని సమర్ధించారు ఎన్నో కాంట్రవర్సీలు ఉన్న ఈ సినిమా తప్పని సరిగా చూడవలసిన చిత్రం.

Leave a comment