మనకు అందుబాటులో ఉండేవే ఇవన్నీ. వీటిల్లో ఎన్నో ఉపయోగ పడే అంశాలున్నాయి. అరటి పూలు, దూట తో కూర వండుకుంటారు కదా. డిప్రెషన్, యాంగ్జయిటీ తో బాధ పడేవారికి ఈ పూల కురతో ఉపసమనం వస్తుందట. ఒంటి పై దెబ్బలు, స్కిన్ ఇన్ ఫెక్షన్ లు వస్తే వాము పేస్టు రాస్తే పోతుంది. వారానికి రెండు మూడు సార్లు సోయాబీన్స్ ఆహారంలో తీసుకోవాలి. రోజుకోసారి గ్రీన్ టీ తాగాలి దాన్లోని యాంటీ అక్సిడెంట్స్ అనవసమైన కొవ్వును తగ్గిస్తాయి. సలాడ్స్ తినే ముందర వాటి పై యాపిల్ సైడేర్ వెనిగర్ చల్లుకోవాలి. డయాబెటిస్ పేషెంట్లకి ఈ చిట్కా చాలా మేలు చేస్తుంది. ఇంటి పనుల్లో చేతులు బిగుతుగా అయిపోతే బంగాళా దుంపల గుజ్జు రాస్తే మృదువుగా అయిపోతాయి. దుంప ఉడికించి రాసినా ఇదే ఫలితం.

Leave a comment