అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఆకు పచ్చ రంగుకే ఎక్కువ సొగసు అని వంద మార్కులు వేసేస్తారు. కలర్ థెరపిస్టులేమో డిప్రెషనూ ఒత్తిడీ తగ్గిస్తుందంటున్నారు. అద్భుతమైన సువాసన తో ఉండే సంపెంగల రంగూ ఆకు పచ్చే. అందమైన హరిత వర్ణాన్ని అద్దుకున్న జ్యూవెలరీ అయితే  ఎప్పటికీ తిరుగులేని ఫ్యాషనే. ఆకుపచ్చ లోనే ఎన్ని ఛాయాలున్నా జ్యూవెలరీ డిజైన్స్ చాలానే ఉన్నాయి. సాధారణంగా సిరి సంపదలకు ప్రతీకగా ఉండే ముదురాకు పచ్చ రాయి ఉంగరాలు ధరించే వాళ్ళ సంఖ్య  ఎక్కువే. ఈ ఆకు పచ్చ రాయి సెట్స్ లో అయితే అంతులేనన్ని ఇమేజెస్ కనిపిస్తాయి. ట్రేడిషనల్ ఆభరణాలు నెక్లెస్ లు రాళ్ల గాజులే కాకుండా ప్రత్యేకంగా అమ్మాయిలు ఇష్టపడే రకరకాల డిజైనర్ లాకెట్స్ తో చూడగానే ఆకట్టుకుంటున్నాయి. అమ్మాయిలకు చూడగానే నచ్చేదెందుకంటే వాళ్లలో సృజనాత్మకత భావోద్వేగాల పసితనపు ఛాయలు ఇవన్నీ కలగలిపి ఈ హరిత వర్ణాన్ని ఎంచుకోమంటాయని మానసిక శాస్త్ర వేత్తలు చెపుతారు. ఈ ఆకుపచ్చ రాళ్ళకి ఎరుపు మేజెంటా ఏ  రాళ్ళూ కలిపినా కాంబినేషన్ చక్కగా ఉంటుంది. బరువైన సంప్రదాయ డిజైన్ లే కాదు చక్కని తేలికైన ట్రెండీ నగలూ వచ్చాయి.

Leave a comment