దేనికైనా మార్కెట్ లో డిమాండ్ ఉందీ అందటే దాన్నీ వినియోగదారునికి అందించేందుకు ఎన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చికెన్ ప్రియులు ఉంటారు. డిమాండ్ పెరిగటమే కానీ తరగటం ఉండదు. మరిన్నీ హాంగు ఆర్భాటాలతో చికెన్ ని ఖరీదైన డిష్ గా మార్చేశారు న్యూయర్క్ లోని ద ఎయిర్ వర్త్ రెస్టారెంట్ వాళ్ళు.  వీళ్ళు చికెన్ వింగ్స్ కి బంగారపు పొడి అద్ది బంగారు కోడి వింగ్స్ తయారు చేసేవారు. బంగారపు అద్దుకొన్న ఈ వింగ్స్ ఓ రోజంతా అలా వదిలేసి దానికి కొబ్బరి బటర్ ,తేనె ,కారం వేసి మసాలాలో ఉడికిస్తారట. అప్పుడీ చికెన్ వింగ్స్ బంగారపు రంగులో ధగధగలాడిపోతూ చూసేందుకు ,తినేందుకు కూడా అద్భుతంగా ఉన్నాయి.

Leave a comment