ఈ సీజన్ లో శిరోజాల పై ఎక్కువ శ్రద్ద చూపించాలి అంటారు హెయిర్ స్టైలిస్టులు. శిరోజాలు స్టైలింగ్ కు లొంగవు. ఈ వర్షాల్లోనే ఎక్కువసార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా జిడ్డు జుట్టు ఉండేవాళ్ళు ఎక్కువసార్లు చేయాలి. కండీషనర్స్ కు బదులు కిచెన్ లోని కండీషనింగ్ పదార్ధాలు వాడుకోవాలి. టీ, నిమ్మరసాలతో కడగడం ఈ సిజన్ లో అనువుగా ఉంటుంది. నీటిలో తేయాకు వేసి బాగా మరగనిచ్చి చల్లార్చి ఈ నీటితో షాంపూ తర్వాత జుట్టు కడిగేయాలి. మగ్గు నీటిలో నిమ్మరసం కలిపి అప్లై చేయడం వల్ల జిడ్డు తగ్గిపోతుంది. గుప్పెడు తాజాగా గాని ఎండినవి కాని బంతిపూల రేకుల నీటీలో వేసి వేడి చేసి ఓ గంట సేపు అలా వదిలేసి ఆ చల్లార్చిన నీళ్ళను చివరి రివ్స్ గా వాడుకుంటే వెంట్రుకలు చక్కని వాసనతో ఉంటాయి.

Leave a comment