ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మల్లో బార్బీ డాల్ ఒకటి .చిన్న పిల్లలు అమితంగా ప్రేమించే బొమ్మలివి. ఇప్పుడు ఆ బొమ్మల్ని చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా తయారుచేస్తున్నామని చెపుతోంది బార్బీ సంస్థ మట్టెల్ ఇప్పటి వరకు వ్యోమగామిగా ఫైర్ ఫైటర్ గా గేమ్ డెవలపర్ గా అనేక రూపాలలో వచ్చిన బార్బీ డాల్ ఇప్పుడు కోవిడ్ 19 ను ఎదుర్కోవటం తో ప్రాణాలకు తెగించి కృషిచేసిన అరుగుల కోవిడ్ వారియర్స్ రూపంలో రాబోతోంది. ఈ ఆరుగుర్ని వారి వృత్తికి తగ్గట్టు డ్రెస్ లు చేసే వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆస్ట్రా జెనికా  వ్యాక్సిన్ రూపకర్త సారా గిల్ బర్ట్ కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఎమర్జెన్సీ రూమ్ నర్స్ అమీ ఓ సల్లివాన్ లాస్ వెగాస్ లో వివక్షకు గురైన డాక్టర్ అడ్రి క్రూజ్, హెల్త్ కేర్ లో జాతీయ జాత్యాహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన కెనడాకు చెందిన డాక్టర్ స్టేసీ ఒరివ్వా  కోవిడ్ జన్యూ క్రమాన్ని గుర్తించిన రీసెర్చర్‌ జాక్వెలిన్‌ గోస్‌డిజెస్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కోసం ‘ ఉతికి వేసుకో గల డ్రెస్ రూపొందించిన డాక్టర్‌ కిర్బి వైట్‌లు బార్బీ బొమ్మలు పిల్లలు చేతుల్లోకి వస్తున్నారు బార్బీ బొమ్మలు రోల్ మోడల్స్ గా  పిల్లలు గుర్తిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకోగలుగుతారని ఆ దిశగా వారు ఎదుగుతారని ఆశిస్తున్నామని చెబుతోంది మట్టెల్ సంస్థ.

Leave a comment