Categories
వర్షంలో మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ పౌండేషన్లు జోలికి వెళ్ళవద్దు. కాంపాక్ట్ పౌడర్ చాలు. దీని వల్ల ఆయిల్ స్వెట్టింగ్ రూపం పోతుంది. ముందుగా దూదితో ఆస్ట్రిజెంట్ లోషన్ అప్లై చేయాలి. పరిశుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్ లు ఉంచి మొహం మెడపై మాసాజ్ చేయాలి. అలా చేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. చక్కని నీళ్ళతో మొఖం కడుక్కున్న పర్లేదు కాంపాక్ట్ పౌడర్ అద్ది పౌడర్ బ్లషర్లు వాడితే సరిపోతుంది. వీటిని చిక్ బోన్స్ పై అప్లై చేసి బ్రెష్ తో బ్లండ్ చేయాలి. వాటర్ ప్రూఫ్,ఐ లైనర్,మస్కరా సరైన ఆప్షన్లు.