గర్భిణీలకు కాస్త దూరం ప్రయాణం చేసిన కాళ్ళలో వాపు కనిపిస్తుంది. శరీరం కాస్త బరువుగా అనిపిస్తే ఈ ఇంటి చిట్కాలు అనుసరించమంటున్నారు పెద్దలు. బార్లీ ,అల్లం,ఆకుకూరలు,అరటిపండ్లు,మజిగ్గ వినియోగం ఎక్కువ కావాలి. టమాటో రసం తాగితే మంచిది. బార్లీ ఉడికించిన నీళ్ళను రెండు పూటలా తాగితే మూత్రం ఎక్కువగా పోయి శరీరంలో అధిక నీరు తగ్గుతోంది. మునగాకు కాడలను చిన్న ముక్కలుగా చేసి రెండు గ్లాసుల నీళ్ళలో మరిగించి,ఆ నీళ్ళు సగం వరకు ఇరిగిపోయాక. ఆనీళ్ళలో అర చెంచా మిరియాలపొడి కొద్దిగా ఉప్పు వేసి తాగితే మంచిది. శరీరంలోని నీటిని మూత్రం ద్వారా పంపిస్తుంది ఈ కషాయం చిన్న అనారోగ్యాలకు మందులు లేకుండా ఈ గృహ వైద్యం పాటిస్తే మంచిది అంటున్నారు.

Leave a comment