మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం అనే భ్రమలో ఉంటాం కదా. కొత్త పరిశోధన ఇదంతా మీ ఆశే గానీ బరువు తగ్గటం అన్నది జన్యువుల పైన ఆధారపడి ఉంటుందని డి. ఎన్. ఎ  టెస్టుల ద్వారా తేల్చారు. 35 నుంచి 65 సంవత్సరాల లోపు స్త్రీ  పురుషులపైన ఈ పరిశోధన చేసారు. వీరికి మంచి డైట్ ఫుడ్ కొందరికి మంచి పుష్టికరమైన ఆహారం  ఆ తరువాత రెండు గంటల వర్కవుట్స్ చేయించారు. బరువు తగ్గటంలో ఎన్నో అసమానతలు కనిపించాయి. ఇందుకు జన్యుకణాలు కారణమని తేల్చుకున్నారు. అంచేత బరువు పెరిగే గుణం మన జన్యువుల్లో ఉంటే తిండి మానేసినా గంటలకొద్దీ చెమటలు చిందించి వ్యాయామం చేసినా పైసా ఉపయోగం లేదని తేలింది . చాలా మందికి ఇది మంచివార్తే. ఎంత చేసినా తగ్గం లెద్దూ అని మంచి భోజనానికి రెడీ అవ్వచ్చు.

Leave a comment