పెరిగే వయస్సున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అధ్యయనాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. రిపోర్టు ఇలా వుంది. పిల్లల ప్రవర్తనకు సంబందించిన చర్చలు, ఆరోగ్యవంతమైన నిబందనలు పెట్టే వారికి, ఏ మాత్రం చరచాలకు ఆస్కారం ఇవ్వకుండా. కఠినమైన నిబందనలు పెట్టేవారికి ఈ నిభందనల విశ్లేషనల్ని విస్తృత స్థాయిలో నిర్వహించినప్పుడు, ఎక్కువ ఆంక్షలకుగురయ్యే పిల్లలు అధిక బరువు తో ఉన్నాట్లు గుర్తించారు. బాగా కఠినంగా వుంటూ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు సంతృప్తిగా వుంటారు. అయితే ఈ కఠిన నియంత్రణకు లోనైన పిల్లలు విపరీతమైన వత్తిడికి గురై బరువు పెరిగిపోతారట. పిల్లల బరువు వాళ్ళు తినే పదార్ధాలు. ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు. పెంపకం తీరు,వాళ్ళ గురించి నిరంతరం చేసే చర్చలు, తీర్మానాలు, వాళ్ళు పిల్లలను శాశించే తీరుఇవి పిల్లల పైన ప్రభావం చూపెడతాయి. ఈ టెన్షన్ కు పెద్దవాళ్ళ లాగే ఎదో ఒక్కటి తియ్యనిది తినేస్తుంటారు. మనస్సు మరల్చుకునేందుకు తల్లిదండ్రుల నియమాల బాధ తప్పించుకోలేక పిల్లలు తిండిని ఆశ్రయిస్తారు. ఇలాంటి స్థితిని పిల్లలకు కల్పించ వద్దని పిల్లల పెంపకంలో పరిమితులు ఆంక్షలు నడుమ సరైన సమతుల్యం వుండాలని రిపోర్టు చెపుతుంది.

Leave a comment