గర్భం ధరించాక తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి తీసుకునే ఆహారం వల్ల గానీ సహజంగా బిడ్డను గర్భంలో మోస్తున్నప్పుడు జరిగే శారీరక మార్పుల వల్ల గానీ బరువు పెరగటం చాలా సహజం. పైగా అలా బరువు పెరిగే ఆరోగ్యం అంటారు డాక్టర్లు. ప్రసవం తర్వాత బరువు పెరిగే వ్యాయామాల వల్ల పెరిగిన బరువును సులభంగానే తగ్గించుకోవచ్చు. అలాగే పాలిచ్చే తల్లులు వేగంగానే బరువును పోగొట్టుకొంతారు. ప్రసవించిన ఆరు వారాల లోగానే వ్యాయామాలు పెట్టి బరువు క్రమేపీ తగ్గించు కోవచ్చు. అంచేత గర్భిణిగా వున్న సమయంలో బరువు గురించి అలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దంటున్నారు డాక్టర్లు. పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించాలి.

Leave a comment