వారంలో ఒక రోజు ఉపవాసం చేయటం మంచిదే కానీ, అది బరువు తగ్గేందుకు ఉపయోగపడదు అంటారు ఎక్స్ పర్ట్స్. వారంలో ఒక్క రోజు ఉపవాసం శరీరక వ్యవస్థలోని విషతుల్యాలను బయటికి పంపుతోంది. ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినటం,జ్యూస్ తాగటం చేస్తారు కనుక ఆ తేలికైన ఆహారంతో టాక్సిన్స్ బయటకి పోతాయి. ఈ  ఉపవాసం బరువుపై తాత్కలిక ప్రభావం చూపిస్తుంది. రోజుల కొద్దీ ఉపవాసం చేసి బరువు తగ్గటం మంచి ప్రయోగం కాదు,దాని వల్ల ప్రయోజనం లేకపోతే శరీరం అత్యవసర పోషకాలు పోగొట్టుకొంటుంది. జీర్ణవ్యవస్థ నెమ్మదై పోతుంది.  రోగనిరోధక వ్యవస్థ బలహీనమైపోతుంది.రోజుల తరబడి ఆహారం తినకండా ఉండటం సరైన పద్ధతికాదు.

Leave a comment