ప్రతీ రోజు ఒక వంద గ్రాముల ద్రాక్ష పండ్లు ఒక ఔషదం లాగా తీసుకొమ్మంటున్నారు అమెరికా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ వంద గ్రాముల ద్రాక్ష తో శరీరం లో బరువు తగ్గించుకోవడం తో పాటు ప్రేవులో మంచి బాక్టీరియా వృద్ధి చెందటం జరుగుతుంది అంటున్నారు అధ్యాయినకారులు. ఈ పరిశోధనలో కొంతమంది ఊబకాయులకు పారకుండు వారాలపాటు ఈ ద్రాక్ష పండ్లూ ఇచ్చారు. వారి బరువులో స్వల్ప మార్పులు రావడం తో పాటు శరీరంలో స్వల్ప మార్పులతో పాటు శరీరం కొవ్వు శాతాన్ని తగ్గటాన్ని గమనించారు పరిశోధకులు. సాధారణమైన ఆహారం ఇచ్చిన వారి బరువు లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కేవలం ద్రాక్ష పండ్ల వల్లనే ఈ మార్పు వచ్చిందని పరిశోధకులు చెప్పారు.

Leave a comment