ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , మినరల్ ఎంజైమ్స్ కావలిసినన్ని పోషకాలు దొరుకుతాయి. దీన్ని అనేక కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. తేనె నిమ్మరసం ,వెల్లులిరసం , అల్లం రసం ,సలాడ్స్ ,కూరలు ,ఫ్రైలు ,మాంసాహార వంటకాల్లో వాడుతుంటారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ సర్వరోగ నివారిణి అంటుంటారు. ఎన్నో ఔషధ విలువలున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వెనిగర్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడండి. ఎందుకంటే బరువు తగ్గేందుకు ఈ వెనిగర్ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి.

Leave a comment