స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరి ఉపయోగించి చేసిన ప్రతి పదార్థంలోనూ బరువు తగ్గించే గుణం ఉందన్నారు. సాధారణంగా వుండే కొవ్వులు కాకుండా మీడియం సైజు ట్రైగ్లినరైడ్  ఫ్యాట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోవడం అంటూ జరగదు. కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా ఒంట్లో చక్కెరల స్థాయిని ఏమాత్రం పెంచవని తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రతి 100 గ్రాముల కొబ్బరి లో 15 గ్రాముల కార్బోహైడ్రాట్స్ ఉంటాయి. కార్బోహైడ్రాట్స్ తక్కువగా తీసుకోవాలని భావించే వారు కొబ్బరి ఆహారంగా తీసుకోవచ్చు. వంద గ్రాముల కొబ్బరిలో 354 కీలకాల శక్తీ లభిస్తుంది. ఇది చాలా ఎక్కువ కాబట్టి తక్కువ పరిమాణంలో కొబ్బరిని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన కీలకాల్లో ఏడోవంతు  కొబ్బరి ద్వారా తీసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు.. పచ్చి కొబ్బరి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శారీరికంగా అలసటగా వుంటే  కొబ్బరి తినటం వల్ల  వెంటనే శక్తి  లభిస్తుంది. ధైరాయిడ్ సమస్యలు అదుపులో వుంటాయి.

Leave a comment