Categories
WhatsApp

బరువు తక్కువగా ఉన్నా మానసిక అశాంతే

సన్నగా ఉంటె ఎంతో బావుంటారని, లావుగా వుండటం వల్లనే సమస్యలనీ ఒక భ్రమలో ఉంటారు కానీ అసలు సన్నగా ఉన్న వాళ్లలోనే డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఒక అధ్యయనం రిపోర్ట్ చెపుతుంది. బరువు తక్కువగా ఉండటమే వాళ్ళ మానసిక అశాంతికి కారణమని రిపోర్ట్ విశ్లేషించింది. స్త్రీ పురుషుల్లో కూడా ఈ బరువు తక్కువగా ఉండటం వల్ల మానసికంగా కుంగుబాటు కనిపిస్తుంది. వీరిలో శారీరక బలహీనతతో పాటు ఆత్మవిశ్వాసం సన్నగిల్లటం, ఆత్మన్యూనత, పోషకాహారలోపం తరితర కారణాలు డిప్రెషన్ కి దోహదం చేస్తాయని వీరు అభిప్రాయపడుతున్నారు. పై లోపాలు సర్దుకోగలిగితే వీరు మానసిక అశాంతి నుంచి బయట పడతారని పరిశోధకులు చెప్పారు. ఒక రకంగా కాస్త బరువు ఉన్నవాళ్ళే ఆరోగ్యంతో, ఆనందంతో ఉంటారని, కాస్త బరువు తగ్గితే బావుంటామన్న కోరికతో వారు ఇంకా విలువైన పోషకాహారం తీసుకుని ఇంకా ఆరోగ్యంగా ఉంటారని చెపుతున్నారు.

 

Leave a comment