తక్కువ క్యాలరీలతో ఎక్కువ ప్రోటీన్లు అందిస్తాయి కనుక బరువు తగ్గాలంటే ఉత్తమమైన ఆహారం పెసలు. మొలకెత్తించి, ఉడికించి,పప్పుగా వండుకుని పిండిగా చేసి ఎన్నో విధాలుగా పెసలు వాడుకోవచ్చు. పెసల్లో ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్లు, పీచు శక్తినిచ్చే పిండి పదార్ధాలు అనేక బయో యాక్టీవ్ ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని అమైనో యాసిడ్స్,పోలి ఫినాల్స్ వృద్దాప్యాన్ని దగ్గరకు రానివ్వవు. పెసలలోని ప్రోటీన్లు తేలిగ్గా జీర్ణం అవుతాయి. తేలిగ్గా ఉడుకుతాయి. బియ్యం,ఓట్స్ తో కంటే తృణధాన్యాలతో కలిపి వండటం చాలా సులభం మొలకెత్తిన పెసల్లో ఇంకొన్ని అదనంగా పోషకాలు లభిస్తాయి.

Leave a comment