బరువు తగ్గాలంటే వీలయినంత వరకు ఆహారంలో పీచు ఎక్కువగా తినాలత. ఎలాగంటే మన కడుపులో ప్రేవులలో వుండే బాక్టీరియా ఏం తింటుందో దాన్ని బట్టి బరువు ఆధార పది ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. ఆహారం లో పీచు ఎక్కువగా వుంటే జీర్ణ క్రియ బావుంటుంది. కడుపులో వుండే బాక్టీరియా ఈ పిచును ముందుగానే తినేస్తుందిట. పీచు తక్కువగా వున్నప్పుడు ప్రేవులలోని బాక్టీరియాలో తేడా లోచ్చేస్తాయిట. అమెరికా తదితర దేశాల్లో ఆహారంలో కొవ్వు చక్కర్లు ఎక్కువగా వుండటం పీచు తక్కువగా వున్నా కారణం తోనే వుబకాయం, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. పీచు ఎక్కువగా వుండే పదార్ధాలతో ఈ ఊబకాయ  సమస్య వుందని శాస్త్రజ్ఞులు తాజా పరిశోధనా ఫలితాల్లో వెల్లడించారు.

Leave a comment