లీడర్ తర్వాత ప్రియా ఆనంద్ తెలుగులో సినిమాలు ఎక్కువగా చేయలేదు. ఇప్పుడు కోలివుడ్ , మాలివుడ్ సినిమాలలో బిజీగా ఉన్నా ప్రియా ఆనంద్ తెలుగులో మంచి పాత్రలు రాకపోవటం వల్లనే అటు వైపు వెళ్ళాను అంటుంది. తెలుగు, ఇంగ్లీషు,హిందీ, మళయాలం భాషల్లో నా డబ్బింగ్ నేనే చెప్పుకునేంతగా వచ్చు. భాషా రావటం వల్ల వెంటనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగాను. తెలుగులో ఇప్పుడే అడుగుతున్నారు మెహమాటం వల్ల గతంలో కొన్ని నాకు సరిపడని పాత్రలు ఒప్పుకున్నా. ఇప్పుడిక పాత్రల గురించి శ్రద్దగా ఉండాలనుకున్నా అంటుంది ప్రియా ఆనంద్.

Leave a comment