తులసి బెస్ట్ మెడిసిన్

ఎన్నో ప్రయత్నాలు చేసినా చుండ్రు సమస్య వదలకుండా ఉంటుంది. ఈ చిట్కా వైద్యంతో జుట్టు కుదుళ్లు బలంగా అవ్వటం తో పాటు చుండ్రు పోతుంది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తులసి చుండ్రును పోగొడుతుంది. కొన్ని తులసి ఆకులు తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల ఉసిరి కాయ పొడి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ ను తలకు పట్టించి మర్దనా చేయాలి అరగంట తర్వాత నీళ్లతో కడిగితే సరిపోతుంది.రెండు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. ఒకే దువ్వెన అందరూ ఉపయోగించకూడదు చుండ్రు ఉన్నవాళ్ళు సపరేట్ దువ్వెన వాడితే ఆ చుండ్రు ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది .