భువనేశ్వర్ కు చెందిన ఇద్దరు కవలలు నిషితా, నిఖిత ఫోర్స్ ఇండియా 30 అండర్ 30 నిలిచారు.నికిత మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్,ఎనర్జీ స్టోరేజ్ కోసం నానో మెటీరియల్స్ కు సంబంధించిన కోర్సు పూర్తి చేసింది. నిషిత కార్పొరేట్  ఫైనాన్స్ చదివింది.బ్యాటరీ ధర్మల్ మేనేజ్మెంట్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైనింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కు అవసరం అయ్యే బ్యాటరీ సొల్యూషన్స్ పై పనిచేసేందుకు అర్హత సాధించింది. ఇద్దరు కలిపి అతి తక్కువ సమయంలో చార్జి అయ్యే బ్యాటరీని పంట వ్యర్థాలతో రూపొందించారు ,ఎకో ఫ్రెండ్లీ పద్ధతి తో తయారు చేసిన ఈ బ్యాటరీలు తక్కువ ఖర్చుతో వినియోగదారుకి  అందుతాయి. ఈ ఏడాది ఇద్దరు ఫోర్బ్స్ స్థానం సంపాదించారు.  అలాగే ప్రముఖ సంస్థ నుంచి దియాంగ్ గ్లోబల్ అంబాసిడర్  అవార్డు కూడా తీసుకున్నారు.

Leave a comment