మంచి కథ నా దగ్గరికి వస్తే క్షణం కూడా సందేహపడకుండా వెంటనే ఓకె అనేస్తా అంటుంది కీర్తి సురేష్.కథల ఎంపికలో చాలా శ్రద్దగా ఉంటాయి. ఎవరైన సరే జాగ్రత్తగా విని ఎంచుకోవలిసిందే కదా. ఒక్క సినిమా సక్సెస్ అయిన కొద్ది యాక్టర్స్ పై అంచనాలు,బాద్యత పెరుగుతుంది.అందుకు అనుగుణంగా కథలపై నిర్ణయాలు తీసుకోవాలి అంటుంది కిర్తీ.నేనయితే కథ బావుంది అని నా మనసు చెప్తే చాలు మరింత వెనకా ముందు ఆలోచించుకోవటం ఏమీ లేదు.అదృష్టాన్ని నమ్ముతాను నేను. ఎంత ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకున్న అదృష్టమే కెరీర్ లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మహానటి చూడండినాకే ఆశ్చర్యం, అదృష్టం అనిపిస్తుంది అంటుంది కీర్తిసురేష్.

Leave a comment