పాత తరంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉండేవుంటుంది. అప్పటి పరిస్థితులు కారణంగా ఎవరు బయటపడలేదేమో ఇప్పటి వారికి ధైర్యం ఎక్కువ కనుక నిర్భయంగా మాట్లాడుతున్నారు అంటుంది వరలక్ష్మి శాంతన్ కుమార్. మా నాన్న శాంతన్ కుమార్ అందరికి తెలుసు,అయినా నా పై వేధింపుల ప్రయత్నాలు జరిగాయి. కొన్నాళ్ళ క్రితం ఒక టీవీ చానల్ లో ఇంటర్యూ ఇచ్చాను. ఆ యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అన్నారు. ఆమిగతా ఎమిటో అందరికి తెలుసు స్టార్ కీడ్ అయినా నాకే ఇలాంటి పరిస్థితి తప్పకపోతే మిగతావాళ్ళ సంగతి ఏంటీ. బయటకు వచ్చే ఆ యాంకర్ అన్న మాటలు అందరికి చెప్పాను. హీరోయిన్లతో పర్సనల్ గా మాట్లేడే విషయాలు ఏముంటాయి. వాళ్ళేమి కుటుంబ సభ్యులు కాదు కదా. ఎంత మొత్తుకుంటున్న ఇవి ఆగవు.

Leave a comment