ఇరవై ఏళ్ల గౌరీ చిందార్కర్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ప్రతిభాశాలిగా బిబిసి గుర్తించింది. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే స్కూల్ లో సెల్ఫ్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ని తీసుకొచ్చిందీ అమ్మాయి. మరాఠీ తప్ప ఇంకో భాష రాని గౌరీ ఇంగ్లీష్ నేర్చుకొని, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో ఉన్న టీచర్స్ తో పాఠాలు చెప్పించే స్థాయికి ఎదిగి స్కూల్ స్థాయిని కూడా పెంచింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ని ఉపయోగించుకొని స్కూల్ పిల్లలు ఎలా బాగుపడోచ్చో నిరూపించింది. ఇటువంటి పద్ధతిని ఇప్పుడు స్కూల్ ఆఫ్ క్లౌడ్ అని పిలుస్తున్నారు. ఈ క్లౌడ్ ని ఉపయోగించుకొన్న మొదటి భారతీయ అమ్మాయి గౌరీ. మరెంత మందో స్కూల్ పిల్లలకి ఈ మార్గం చూపించి, విదేశాల్లో ఉన్న స్వచ్చంద టీచర్స్ చేత పాఠాలు చెప్పించింది.చదువంటే ర్యాంకులు కాదు భిన్నమైన కొత్త జీవితం అని నిరూపించింది గౌరీ. 2016 బిబిసి జాబితాలో ఈ అమ్మాయి పేరు చూసి గౌరీ ఎంత ఆశ్చర్య పడిందో, ఆమె ఇంజనీరింగ్ చదువుతున్న పూనా కాలేజీ వాళ్ళు కూడా అంతే ఆశ్చర్యపోయారట.
Categories
Gagana

బిబిసి జాబితాలో ఇంజనీరింగ్ స్టూడెంట్

Leave a comment