ప్రతిరోజు వ్యాయామం మంచిదే కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే చర్మ సమస్యలు తప్పవు అంటున్నారు ఎక్సపర్ట్స్. జిమ్ ఫిట్ నెస్  సెంటర్లలో ఉపయోగించే యంత్రాలు ఎప్పటికప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్ తో తుడవాలి. ఇంట్లో ఉపయోగించే వ్యాయామ సాధనాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కసరత్తులు చేసే సమయంలో రిస్ట్ బ్యాండ్స్ ఆభరణాలు వంటివి ఏవి ఉంచుకోవద్దు. మేకప్ తో వర్క్ వుట్స్ చేయకూడదు ఇందులో ఉండే రసాయనాలు చెమటతో కలవటం వల్ల మొటిమలు దద్దుర్లు ఇబ్బంది పెడతాయి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.

Leave a comment