ఈ గుడిలో చండీ మాతను భక్తులతో పాటు ఎలుగుబంట్లు కూడా కొలుస్తారు. ఈ చండీదేవి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులోని మహా సముంద్ జిల్లా గుంచ్ పాలి గ్రామంలో కొలువై ఉన్నది. దండకారణ్యానికి ఆనుకొని ఉన్న ఈ దేవాలయంలో హారతి ఇచ్చే సమయంలో పూజారి శంఖం పూరించగానే అడవి లోని ఎలుగుబంట్లు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజారి అందించే తీర్థప్రసాదాలు తీసుకొని వెళతాయి. కొన్నేళ్లుగా అమ్మవారి సన్నిధికి వస్తున్నా ఈ ఎలుగుబంట్లు భక్తులు ఏ ప్రసాదం ఇచ్చిన తీసుకుంటాయి. ఎవరి పైన దాడి చేయవు. నిత్యం ఎలుగుబంట్లు సంచరించే ఈ దేవాలయాన్ని బేర్ టెంపుల్ అని పిలుస్తారు.

Leave a comment