ఇకత్ పేరు మోసిన టై అండ్ డై విధానపు అందమైన నేత చీరె.తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సాలో, చేనేత కళాకారులు సృష్టించే ఈ చీరె ఎప్పటికీ తిరుగులేనిదే కావలసిన రంగును సృష్టించేందుకు ఎన్నోసార్లు నూలు బట్టలను రంగులో ముంచి ఎండలో ఆరబెడతారు. పట్టు దారాల తో నేసే పోచంపల్లి,పుట్టపాక చీరెలు,డబల్ ఇక్కత్ చీరెలు గా పిలుస్తారు.ఇండోనేషియా, జపాన్లలలో, నేసే డబల్ ఇకత్ రంగులు  డిజైన్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన వస్త్రాలు. లేత రంగులో,పచ్చని చిలుకలు గజరాజుల రూపాలతో ప్రకృతి వర్ణాలతో ఇక్కత్ పట్టు ఎలాంటి లోపం ఎంచలేనిది.

Leave a comment