ఇంట్లో నలుమూలలా పచ్చని చెట్లు పెంచటం ఇప్పుడూ పర్యవరణ ప్రేమికులు ఆదరిస్తున్న ట్రెండ్. ఇంట్లో నాలుగు గోడల మధ్య పెంచే చెట్లలో పీస్ లిల్లీని రాణి మొక్క అంటారు. అంత అందమైన మొక్క అన్నమాట ముదురు పచ్చని ఆకులు తెల్లని పుఅవ్వులతో దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. అందమైన కుండి ఎంచుకుని హాల్లో రీడింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే చూసేందుకు బావుంటుంది. ఈ మొక్కను పెంచి కుండీలో మట్టిని కొద్దిగా తేమగా ఉండేలా చూసుకుంటే చాలు. ఒకే ఒక్క మొక్కతో హాలు మొత్తం లుక్ మారిపోతుంది. స్వచ్చమైన గాలి కోసం అందం కోసం ఇలాంటి మొక్కల్ని పెంచుకోవచ్చు.

Leave a comment