పిల్లలు పుట్టిన రోజు వేడుకల కోసం అందంగా ఉండే షుగర్ లేస్ లు తయారు చేస్తున్నారు బేకరీ ఆర్టిస్ట్ లు పువ్వులు, ఆకులు, జంతువుల డిజైన్లతో కూడిన ఎడిబుల్ డాయిలీ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. పంచదార లేస్ లేదా షుగర్ డాయిలీ తయారీ సులభమే బియ్యంపిండి, కార్న్ ఫ్లోర్ మరిగించిన నీళ్లు ఐసింగ్ షుగర్ కలిపి పేస్ట్ లా చేసి దాన్ని మౌల్ట్ పైన పరిస్తే అది ఆరిపోయి అందమైన లేస్ లా విడిగా వచ్చేస్తుంది. స్టార్ హోటళ్ళలో కూడా టీ డికాషన్, పాలు, తో పాటు తెల్లని అందమైన లేసుల్ని ట్రే లో పెట్టి అందిస్తున్నారు ఈ లేస్ టీపై వేస్తే కొంచెంగా కరుగుతూ తీపి, క్రీము నోట్లోకి వెళుతూ టీ రుచి మరింత అద్భుతంగా ఉంటుందట. ఇంట్లో తయారు చేసుకోవాలంటే మౌల్ట్ లు మార్కెట్లో దొరుకుతున్నాయి.

Leave a comment