సాంప్రదాయ చుడిదార్ లంగా ఓణీ, గాగ్రా, చీరె సరిగ్గా మ్యాచ్ అవుతాయి చాంద్ బాలి లోలాకులు. కుందన్ లు వజ్రాలు,అన్ కట్ వజ్రాలు,  కెంపులు, పచ్చలు, తెల్లరాళ్ళు, నీలాలు అన్ని రకాల రత్నాలు కలబోసి ఈ చాంద్ బాలి లను వేలకొద్దీ డిజైన్లలో తయారు చేస్తున్నారు. బరువైన ఈ చాంద్ బాలి  జుంకీలకు తోడుగా నెక్లెస్ లు ఆహారాల్లో కి కూడా చంద్రవంకల్ని చూపించటం మొదలు పెట్టారు డిజైనర్లు. ఈ చాంద్ బాలి నగల సెట్ క్రేజ్ నానాటికీ పెరిగిపోతోంది. పోడవాటి ఆహారాలకు చాంద్ బాలి పెండెంట్ లు కెంపులు రాళ్లు, ముత్యాలు కలబోసుకుని అమ్మాయిల అందం తో పోటీ పడుతున్నాయి.

Leave a comment