అది 1500 చదరపు అడుగుల నివాసగృహం మరో 400 అడుగుల ఇంటి ఆవరణ ఇంకో 400 అడుగులు బయట ఆవరణ అంతా కలిపి బెంగళూరు నగరంలో ఉన్న ఈ ఇల్లు ని ఇప్పుడు ఆశ్రమ గార్డెన్స్ గా పిలిచే ఒక అడవి లా మార్చారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నటరాజ్. బెంగళూరులోని బనశంకరి ప్రాంతంలో ఉండే ఈ ఇంటి పైన చుట్టూ కొన్ని వందల చెట్లు ఉంటాయి. పొదలు,తీగలు మొత్తం కలిపి రెండు వేల రకాలుంటాయి ఇల్లు చల్లగా ఉండేందుకు. ప్రకృతికి కొంత మేలు చేసేందుకు మొదలుపెట్టిన ఈ మొక్కల పెంపకంఈ పదేళ్లలో ఆశ్రమ గార్డెన్స్ గా క్రేజ్ సంపాదించింది. ఇన్ని మొక్కలు పెట్టేందుకు బరువైన మట్టి కాకుండా,కొబ్బరి పీచు బరువులేని సేంద్రియ ఎరువులు గృహ వ్యర్థాలు మాత్రమే వాడారు నటరాజ్ ఉపాధ్యాయ. డ్రమ్ము ల్లో ఈ తేలికపాటి వ్యర్థాలతో పెంచిన మొక్కలు అది పదిహేను అడుగులు పెరిగి ఇంటిని అడవి అంతా అందంగా చేసేశాయి. ఈ తోటలో, కోతులు, ఉడతలు, పక్షులు, సీతాకోకచిలకలు ఇంకా ఎన్నో కీటకాలు హాయిగా జీవిస్తున్నాయి. బెంగళూరు నగరంలో ఒక మామూలు ఇంటి పైన ఇంత అడవి ని సృష్టించిన నటరాజ్ ఉపాధ్యాయ కు ఎన్నో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సందర్శకులు

Leave a comment