ఎన్ని అందమైన వస్తువులు ఉన్నా వాటిని సరిగ్గా అమర్చకపోయిన, ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా వదిలేసిన ఇల్లు కళ కోల్పోతుంది. అందుకే వారం వారం ఇల్లు శుభ్రం చేసి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టెయ్యాలి కిచెన్ లో హడావుడిగా పప్పులు, ఉప్పులు డబ్బాలు ఒకదానిపై ఒకటి వేస్తూ ఉంటాం. మళ్లీ వంట చేసేప్పుడు ఆ సామాన్ ని అందుకోవటం కష్టమవుతుంది. వాటిని తీసిన చోట పెట్టటం అలవాటు చేసుకోవాలి. పాదరక్షలు వాటి ప్లేస్ లో పాండ్ లో ఉండేలాగా,విడిచిన బట్టలు ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్ లో పడేసే అలవాటు చేసుకునేలాగా,కిటికీల్లో సోఫాల్లో ప్రతి వస్తువు పడేయకుండా వేటి స్థానంలో అవి ఉంచే అలవాటు చేసుకునేలా గా ఉంటేనే ఇల్లు క్లీన్ గా అందంగా ఉంటుంది ఇల్లు అద్దం లా మెరుస్తూ విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది.

Leave a comment