చీరెలు, చుడీ దార్లు లెహంగాలు, డ్రెస్ ఏదైనా కరెక్ట్ మ్యాచింగ్ జుంకీలే. డ్రెస్ స్టయిల్ కు తగ్గట్లు జుంకీలు ఎంచుకుంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావచ్చు. వెండితో తయారైన ఆక్సిడైజ్ అయిన జుంకీలు సాధారణ వెండి జుంకీల కంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి గుజరాతీ  స్టైల్ జుంకాలు ఆక్సిడైజ్ జుంకీ లు ఫ్యాన్సీ డ్రెస్ లకు మ్యాచింగ్ గా బావుంటాయి. డిజైనర్ దుస్తులు అయితే రాళ్ల జుంకీలు ఎంచుకోవాలి. పగడం, ముత్యం, గోమేధికం పొదిగిన 22 క్యారెట్ల బంగారం జుంకీలు సాంప్రదాయ వస్త్రధారణలో బావుంటాయి.

Leave a comment