ఆపిల్, బీట్ రూట్ క్యారెట్ తో చేసిన జ్యూస్ ని ఎ, బి, సి అంటారు ఈ మూడింటితో జ్యూస్ తయారు చేసేటప్పుడు పుదీనా అల్లం కూడా కలుపుకుంటే రుచిగా ఉంటుంది. యాపిల్, క్యారెట్ బీట్ రూట్ సన్నగా ముక్కలు చేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. రెండు కప్పుల నీళ్ళు కలిపి బాగా బ్లెండ్ చేసి వడకట్టుకోవాలి ఈ రసంలో టీ స్పూన్ అల్లం రసం చిటికెడు నల్ల ఉప్పు చిటికెడు దాల్చిన చెక్క పొడి పుదీనా కూడా కలుపుకోవాలి. యాపిల్ వల్ల ప్రొటీన్లు, బీట్ రూట్ వల్ల ఐరన్, క్యారెట్ వల్ల విటమిన్లు శరీరానికి అందుతాయి. ఈ పానీయం  శక్తినిస్తుంది. చర్మకాంతి పెరుగుతుంది.

Leave a comment