చలికాలంలో చర్మన్నీ మెరుపులతో ఉంచాలను కొంటే  ఈ ప్యాక్ సిద్దంచేసుకోవాలి . ఒక శుభ్రమైన బట్టలో పాలపొడి ,బాదంపప్పు పొడి ,బియ్యం పిండి గులాబీ రేకుల్ని కలిపి మూటలాగా చుట్టాలి . స్నానం చేసేప్పుడు నెమ్మదిగా దాన్ని చర్మం పై రుద్దాలి . ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా ఆకర్షణీయంగా తయారుచేస్తుంది . చర్మం సువాసన భరితంగా తాజాగా ఉంటుంది . అలాగే ముల్తానీ మట్టి కూడా చర్మాన్ని శుభ్రం చేసేందుకు పనికి వచ్చే చక్కని అప్షన్ . ఆయిల్ చర్మం అయితే ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకొని ముఖానికి అప్లయ్ చేయాలి . మొటిమలు ,మచ్చలు ఉంటే  ఈ మిశ్రమంలో చందనం పొడి ,రోజ్ వాటర్ ,వేపాకు పొడి కూడా కలపాలి . దీన్ని ఫేస్ మాస్క్ గా వాడితే చలికాలంలో చర్మం చక్కగా ఉంటుంది .

Leave a comment