భారతదేశంలో దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి . సహజమైన అడవులు,జలపాతాలు లెక్కలేనన్ని . ఈశాన్యంలో ఉన్నా మిజోరం లో కొండలు లోయలు మధ్యలో ప్రత్యేకమైన పూలతో నిండిన అరణ్యాలున్నాయి . ఎరుపు ,నారింజ ,గులాబీ  రంగుల్లో పూచే ఈ అర్కెడ్స్ ఎంతో అందంగా ఆహ్లాదంగా కనువిందు చేస్తాయి . ఈ కొండల్లో పూసే పూలు చూసేందుకు కాలిబాటల గుండా నడుస్తూ వెళ్ళాలి . ఉదయం వేళల్లో ఈ పులా అందాలు ఇంకా బావుంటాయి . రాత్రివేళ ఈ ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని మరీ టూరిస్ట్ లు ఈ పూవుల అందాల్ని చూసేందుకు ఉత్సాహపడతారు ఈ అరుదైన పువ్వుల్ని చూసేందుకు మిజోరాం తప్పక దర్శించాలి .

Leave a comment