లెమన్ గ్రాస్ ఆయిల్  అందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.కొబ్బరి నూనెలో రెండు చుక్కలు లెమన్ గ్రాస్ ఆయిల్ ను కలిపి కండరాలు కీళ్ళకు మసాజ్ చేయాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను దూరం చేసి శరీరానికి ఉపశమనం ఇస్తాయి.అలాగే బాడీ లోషన్ లో రెండు చుక్కల లెమన్ గ్రాస్ ఆయిల్ ని కలిపి రాసుకుంటే ఆందోళన చిరాకులను నుంచి స్వాంతన లభిస్తుంది.దురద, చుండ్రు సమస్యలకు కొబ్బరి నూనెలో రెండు చుక్కల లెమన్ గ్రాస్ ఆయిల్ కలిపి తలకు మర్దన చేయాలి.ఇందులోని యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ సమస్యను తగ్గిస్తాయి. అలాగే వేడి నీళ్లలో రెండు చుక్కలు లెమన్ గ్రాస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Leave a comment