ఎప్పుడు జీన్స్, లెహంగాలు, గాగ్రాలు, ఫ్రాక్ లు వంటి ఓల్డ్ మోడల్ దుస్తులేనా! వెరైటీగా పాపాయికి చీరెకట్టు కొంటే చక్కని పట్టుచీరలు, జారీ బార్డర్ లతో అమ్మ ముస్తాబైతే అమ్మాయి ఉరుకుంటుందా.ఇలాంటి అలాగే పాపాయిల కోసం అందమైన ‘మినిట్ రెడీ మేడ్ శారీస్’  వచ్చేశాయి వీటిని గౌను వేసుకొన్నంత సులభంగా క్షణాల్లో తొడిగేసుకోవచ్చు. కుచ్చిళ్ళు, పైటకొంగు, బ్లౌజూ కుట్టేసి వచ్చే ఈ చీరె  డ్రెస్సులు,పిల్లల వయసుకు ఎత్తు కు తగ్గట్టుగా వివిధ సైజుల్లో వచ్చేస్తూ పెద్ద వాళ్ళ చీర లాగే ఎన్నెన్నో వెరైటీలు వచ్చేస్తున్నాయి. అందమైన వెన్నెల్లో పట్టు చీరె చక్కని మడతలతో జారీ తో పాపాయిని శ్రవణ మాసపు పేరంటానికి కో, వరలక్ష్మీ పూజకో తయారు చేయచ్చు. పెళ్లిళ్లు పుట్టిన రోజుల్లో ప్రత్యేకంగా కనిపించేలా ట్రెడిషినల్ లుక్ తో చక్కగా ఉన్నాయి .కాటన్ సిల్క్ బ్రాస్సో,బెనారస్, జార్జెట్ వంటి అగ్రశ్రేణి తో సందర్భానికి తగిన డ్రస్సులు ఎంచుకోవచ్చు .అచ్చం అమ్మ లాంటి సేమ్ డిజైన్ చీరతో పాపాయి మెరిసిపోతోందంటే  ఆశ్చర్యం లేదు .

Leave a comment