ఆరు సంవత్సరాలు ఉన్న పిల్లలు బెడ్ రూంలో టీవీ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఊబకాయం బారినపడతారని చెబుతున్నారు. మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ వయసున్న 600 మంది పిల్లలపైన వీరి సుదీర్ఘకాలం అధ్యాయనం చేశారు. వారి ఆహారపు అలవాట్లు జీవన విధానం టీవీ చూసే సమయం ఆడుకునే సమయం పరిగణనలోకి తీసుకున్నారు. టివీ చూడటం వల్ల ఆ ఖాళీ సమయంలో ఫాస్ట్ ఫుడ్ పిజ్జాలు,బర్గర్లు తినడం వల్ల పెరిగే బరువు ఎక్కువగా కనిపిస్తుందని అధ్యాయనం చెబుతుంది. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ప్రశాంతంగా విశ్రాంతిగా టీవీ చూస్తూ తిండి పైన దృష్టి పెట్టడం వల్ల పిల్లలు బరువు పెరుగుతున్నారని అధ్యాయనం చెబుతుంది.

Leave a comment