Categories

మనం తీసుకునే ఆహారం మాత్రమే శరీర బరువును పెంచుతుందని దానికి సమయ ప్రభావం ఏమీ ఉండదు అంటున్నారు అధ్యయనకారులు. ఏ సమయంలో భోజనం చేశాము అన్న దానికంటే ఎటువంటి పదార్థాలు తీసుకుంటున్నాము అన్నదే కీలకమని ఆలస్యంగా తినటం వల్ల ఆకలి పెరిగి సహజంగానే ఆహారం ఎక్కువగా తీసుకుంటారని చెబుతున్నారు. ఆకలి వేసిన సమయంలో పోషకాలు తక్కువగా ఉండి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాల వైపే మనసు మళ్లుతుందనీ పదార్థాలు పరిమితికి మించి తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఆలస్యంగా భోజనం చేసే సమయంలో ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అన్న విషయంపై దృష్టి సాధించామని చెబుతున్నారు. పరిమితంగా వేలకు తినే ఆహారం శరీరాన్ని ఫిట్ గా బరువు పెరగనీయకుండా ఉంటుందని చెబుతున్నారు.