ఉద్యోగంలో చేరిన ఐదారు నెలలకే అదేంటి ఇలా అయ్యాను ,సన్నగా ఉండేదానికి ఈ పొట్ట పెరగటం ఏమిటి అంటారు .పాతికేళ్ళు కూడా నిండక ముందే ఆకారంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి .ఆడుతూ పాడుతూ, కాలేజీలో పగలంతా మెట్లెక్కి దిగుతూ ,పరుగెడుతూ ఉండే వాళ్ళు ఏకంగా కుర్చీకి అతుక్కుపోవటం వల్ల వచ్చిన సమస్య ఇది .మొదటిదా చివరిదిదా ఎక్కువ సేపు కూర్చోవటం శరీరక శ్రమ లేక పోవటం ,మానసిక ఆందోళన ,ఒత్తిడి ,వేళకు సరైన భోజనం ,బయటి ఆహారం ,నిద్ర వేళల్లో మార్పు ఇవన్ని శరీరం బరువును పెంచి ముందుగా పొట్ట పెరుగుదలని నియంత్రించలేక పోవటం మొదలవుతోంది. తప్పదు జీవక్రియలు మందగించక ముందే వ్యాయామం మొదలు పెట్టటం ,శరీరం బరువు పెరగక పోయినా ,బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంటే శ్రద్ధ తీసుకోవాలి మరి.

Leave a comment