బరువు తగ్గాలనుకొంటున్నారా? ఈజీ… బెండకాయలు తినండి. ఇది తేలికగా అందిన ఉచిత సలహా కాదు. పరిశోధకుల రిపోర్టు. లేతగా నిగనిగలాడే బెండ కాయను ఏ రూపంలో తిన్నా పోషకాలు సమృద్దిగా అందుతాయి. క్యాలరీలు చలా తక్కువ. ఒక కప్పు పచ్చి బెండకాయ ముక్కల్లో 35 క్యాలరీలు మాత్రమే వుంటాయి. కాబట్టి బరువు తగ్గాలంటే ఇది మంచి ఆహారం. ఇందులో కరిగే పిచు, కరగని పిచు రెండు వున్నాయి. సొల్యుబుల్ రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది. డయాబెటీస్ గలవారికి మంచి ఆహారం మరో వైపు కరగని పీచు ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కప్పు ముక్కల్లో 40 శాతం విటమిన్- సి వుంటుంది. బి-విటమిన్ కొద్దిగా వుంటుంది. విటమిన్-ఎ కణాలు టిష్యూల ఎదుగుదలకు ఉపకరిస్తుంది. విటమిన్-కె, కాల్షియం పోటాషియం లభిస్తాయి.

Leave a comment