ఇంట్లో శుభకార్యాల్లో అరిటాకుల్లో భోజనం వడ్డిస్తూ ఉంటారు . ఇలా అరటాకుల్లో భోజనం చేయటం వెనక సంప్రదాయంతో పాటు ఎన్నో ఆరోగ్య లాభాలు దాగి ఉన్నాయంటున్నారు పరిశోధకులు . గ్రీన్ టీ లో లభించే “ఎపిగాలోకె టి బిన్ గాలెట్ అనే పాలి ఫినాల్ అరిటాకుల్లో ఎక్కువగా లభిస్తుంది . ఆకులో వేడివేడి పదార్దాలు వడ్డించుకొని తినటం వల్ల వాటిలోని ఫాలి ఫినాల్ ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుందనీ ఇది చాలా వ్యాధులను దరి చేర నీయదనీ వారు అంటున్నారు . ఈ  ఫాలి ఫినాల్స్ కేన్సర్ తో పోరాడే సామర్థ్యం ఉన్నారన్న విషయం తాజా పరిశోధనల్లో తేలింది . అరటి ఆకుల్లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ఆహారంలోని సూక్ష్మ జీవులన్నీ నాశనం చేస్తాయి . ఇవి మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే అరటి ఆకులో భోజనం ఆరోగ్యం అంటున్నారు .

Leave a comment