నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం  చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ  చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా  హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో అనన్య గా నటించింది. ఇది కూడా ఆమెను ఓ సవాల్ వంటి పాత్రే నట. ఈ పాత్ర కోసం తా ప్సీ బెంగాలీ నేర్చుకుందిట. అందుకోసం ఒక ట్యూటర్ ని నియమించుకుంది.  పాత్రల కోసం  కొత్త భాషలు నేర్చుకునే అవకాశం అరుదుగా వస్తుంది. నేర్చుకుంటూ నటిస్తే ఆనందం ఇంకో స్థాయిలో ఉంటుంది. అరుదుగా వస్తుంది. ఇప్పుడు నాకు చాలా మంచి పత్రాలు వస్తున్నాయి. అందులో ఘాజీలో అనన్య పాత్ర ఒకటి అంటోంది తాప్సీ. ఈ సినిమా 17 న విడుదలవుతుంది.

Leave a comment