మన ముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ కలలు నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంటుంది నిష్రిన్ పారిఖ్ .యాభై ఏళ్లు దాటిన వారికి ఫిట్ నెస్ ట్రైనర్ 18 సంవత్సరాలు గా యోగా పాఠాలు చెబుతూ తను కూడా ఫిట్ గా తయారైంది. 2016 లో ముంబై బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న ది. అలా ఎన్నో కాంపిటీషన్స్ లో మెడల్స్ గెల్చుకొంటూ బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా ఏషియన్ చాంపియన్ షిప్ లో పాల్గొని మోడల్ గా పేరు తెచ్చుకుంది. థాయ్ లో జరిగిన వరల్డ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజికల్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ లో 4వ స్థానంలో నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

Leave a comment