Categories
కరోనా బారిన పడకుండా మాస్కలు తప్పని సరి కావటం తో చాలా మంది సర్జికల్ మాస్క్లు ,మరికొందరు హ్యాండ్ కర్చీఫ్ లనూ వాడుతున్నారు .మాస్కులు ఏదైనా వాటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే ప్రయోజనం .సర్జికల్ మాస్కులు ఒకసారి ఉపయోగించాక ఇక వాటిని పారా వేయాలి .ఇక కాటన్ మాస్కులు ప్రతి రోజూ ఉతకాలి .సబ్బు తో ,వేసి నీళ్ళతో ఉతికి ఎండలో కనీసం ఐదు గంటల పాటు ఆరబెట్టాలి .సూర్య రశ్మి పడే అవకాశం లేకపోతే ప్రెషర్ కుక్కర్ లో ఉప్పునీటిలో కనీసం పది నిముషాలు ఉడికించి ఆరబెట్టాలి .ఐరన్ కూడా చేస్తే మంచిది .