ఎండలు ఎక్కువైపోతున్నాయి వాతావరణంలో తేమ పెరిగి చర్మం జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది. వేడి నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.తేలికైన క్లెన్సర్ తో చర్మాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. దుస్తులు వేసుకునే ముందు తడిలేకుండా తుడుచుకోవాలి డస్టింగ్ పౌడర్ చల్లుకుంటే అది మిగిలిపోయిన తేమను పీల్చుకుంటుంది.ఎండలో బయటకి వెళ్ళే ముందర సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. గాలి దూరని చెప్పులు షూలు ఎక్కువ సమయం ఉంచుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి వదులుగా ఉండే మెత్తని కాటన్ దుస్తులు ధరించాలి.

Leave a comment