పెదవులు పగిలిపోకుండా తాజాగా తేమగా కనిపించేందుకు లిప్ బామ్ రాసుకొంటారు లిప్ బామ్ ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. పెట్రోలియం జెల్లీ నేకాకుండా వివిధ రకాల నూనెలు ఎక్స్ ట్రాక్ట్ లతో చేసిన ఎన్నో రకాల లిప్ బామ్ లు అందుబాటు లో ఉన్నాయి. అలాటి వాటిలో కొబ్బరి,ఆముదం,బాదం,చీస్ వాక్స్ కోకోవా వంటివి ఎన్నిరకాల ఫ్లేవర్ లు ఉంటాయి. ఎండ అతి నీలలోహిత కిరణాల ప్రభావం ,చర్మం పైన కాకుండా పెదవులపైనా కూడా ఉంటుంది. అందుకే లిప్ బామ్ ఎంచుకొనేప్పుడు దాని ఎస్. పి. ఎఫ్ విలువాని ,యాంటీ ఆక్సిడెంట్లు శాతాన్ని బట్టి ఎంచుకోవాలి. పెదవుల పై మృతకణాలను తొలగించక ఎక్స్ ఫాలియేటర్లు,మాయిశ్చ రైజర్లు కలిసి ఉన్న రకాలు మార్కెట్ లో ఉన్నాయి.

Leave a comment