ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి వైద్యుల వరకు అందరు సబ్బుతో చేతులు కడుక్కొంటూ వుండండి వైరస్ భయం ఉండదు అని చెపుతూనే ఉన్నారు. కానీ పదే పదే కడగటం వల్ల చేతుల పై ఉన్న క్రిముల తో పాటు చర్మం పైన ఉండే సహజమైన ఆయిల్స్ కూడా పోతాయి. అందుకే మాయిశ్చ రైజర్ ఉన్న సోప్ ఎంచుకోవాలి. విటమిన్-ఇ ,బాదం,కొబ్బరి వంటి పదార్ధాలున్న మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. ఒక జెల్ లో బాదం నూనె,రోజ్ వాటర్, టింక్టార్ కలిపిన మిశ్రమాన్ని ఉంచుకొని దాన్ని రాత్రి పూట చేతులకు రాసుకొని వదులుగా ఉన్న కాటన్ గ్లౌజులు వేసుకొంటే చేతులు పొడి బార కుండా ఉంటాయి. బాదం నూనెలో తేనె కలిపి చేతులపై రాసుకొని మర్దన చేసినా చేతులు మెత్తగా ఉంటాయి.

Leave a comment