కళ్ల ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే వీలు ఉంది కనుక కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను కలుసుకోవాలి.వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఉద్యోగులు ఆన్ లైన్ క్లాసులలో విద్యార్థులు ఎక్కువ సమయం కంప్యూటర్ దగ్గరే గడప వలసి వస్తోంది. అధిక సమయం స్క్రీన్ పైన దృష్టి నిలపటంతో కళ్ళు అలసటకు గురి అవుతాయి. కళ్లు పొడిబారడం వంటి ఇబ్బందులు వస్తాయి. ఇలాంటప్పుడు టెలి కన్సల్టేషన్ ద్వారా కంటి వైద్యులను సంప్ర దించవచ్చు. అలాగే కాంటాక్ట్ లెన్స్ వాడే వారు తగు జాగ్రత్తలతో లెన్స్ వాడుకోవాలి. మధుమేహం ఉన్నవాళ్ళు కూడా వైద్యులతో కాంటాక్ట్ లో ఉండాలి. ముఖానికి మాస్క్ ధరిస్తే వదిలే ఊపిరి తో కళ్ళద్దాలు మసక బారి పోతుంటాయి. ఇలాంటి సమస్య ఇబ్బంది పెడితే యాంటీ ఫాగ్ కోటింగ్ కళ్ళద్దాలు ఎంచుకోవచ్చు.

Leave a comment